News December 2, 2025
నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.
Similar News
News April 2, 2026
చంద్రుడి చెంతకు మళ్లీ మనిషి.. రేపే పయనం

దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవులను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు నాసా ఆర్టెమిస్-II మిషన్ సిద్ధమైంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ 10 రోజుల జర్నీ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 2న 3:54 AMకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది. ఓరియన్ వ్యోమనౌకలో వెళ్లే ఈ బృందం చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగేందుకు అవసరమైన టెక్నాలజీని పరీక్షిస్తుంది.
News April 2, 2026
NDA గెలిస్తే తమిళనాడు పేరును మారుస్తారు: స్టాలిన్

తమిళనాడు ఎన్నికల్లో NDA గెలిస్తే రాష్ట్రం పేరును దక్షిణ ప్రదేశ్‌గా మారుస్తారని CM స్టాలిన్ ఆరోపించారు. ఆ కూటమికి వ్యతిరేకంగా ఏకం కావాలని తిరుచ్చి సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీజేపీ డమ్మీ ఇంజిన్ ముందు ద్రవిడ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ ఎప్పటికీ తలవంచదు. దేశం మొత్తంలో తమిళనాడులోనే అధిక సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. BJP పాలిత రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ అఘాయిత్యాలు జరగవు’ అని పేర్కొన్నారు.
News April 1, 2026
ఇక మిడిల్ లెవెల్ మేనేజర్లు అవసరం లేదా?

అవుననే అంటున్నారు ట్విటర్ కోఫౌండర్ జాక్ డోర్సే. మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే వీరి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వీరు నిర్వహించే కోఆర్డినేషన్, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సమర్థంగా, వేగంగా చేయగలదని అభిప్రాయపడ్డారు. బిజినెస్ అప్డేట్ సిస్టమ్‌ను ఉపయోగించుకొని వర్క్‌ను కోఆర్డినేట్ చేసుకోగలదని, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని వివరించారు.


