News December 2, 2025

‘రైతన్న.. మీకోసం’లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం

image

వారం రోజులు నిర్వహించిన ‘రైతన్న.. మీకోసం’లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్‌లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్‌షాపులను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 7, 2026

అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.

News March 7, 2026

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

News March 7, 2026

కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

image

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.