News December 2, 2025

ఈ సారి చలి ఎక్కువే: IMD

image

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

Similar News

News March 20, 2026

‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

image

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.

News March 20, 2026

అకాల వర్షాలు.. రూ.62 కోట్ల నష్టం

image

AP: అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు రూ.40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు రూ.22.68 కోట్ల నష్టం(మొత్తం రూ.62.68 కోట్లు) వాటిల్లినట్లు వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని CBN ఆదేశించారు.

News March 20, 2026

సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

image

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.