News December 2, 2025

తిరుపతి జిల్లాలో నకిలీ CI అరెస్ట్

image

తిరుపతి జిల్లా భాకరాపేటలో నకిలీ CI హల్‌చల్ చేశాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన కురబోతుల శివయ్య అలియాస్ శివకుమార్(33) తాను కడప స్పెషల్ బ్రాంచ్ CIనని నమ్మబలికాడు. స్థానిక గొడవల్లో జోక్యం చేసుకుని బెదిరించాడు. ఒకరి దగ్గర బంగారు ఉంగరాన్ని కొట్టేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశామని భాకరాపేట CI ఇమ్రాన్ బాషా వెల్లడించారు.

Similar News

News March 21, 2026

పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో LPG <<19316911>>గ్యాస్<<>>, పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెగ్యులర్ పెట్రోల్ విషయంలో ఆందోళన నెలకొంది. సాధారణ వాహన ఇంధన ధరలను <<19436412>>పెంచబోమని<<>> IOCL ప్రకటించింది. కానీ పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. పెట్రోల్‌పై ₹10-15, డీజిల్‌పై ₹10 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 21, 2026

మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి టైగర్ ఎంట్రీ..!

image

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం గిరిజన ప్రాంత ప్రజలను భయపెడుతున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి ఏలేశ్వరం మండలంలోని “పరిమితడక” గ్రామ సమీపంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతం కాకినాడ-పోలవరం జిల్లాల బోర్డర్ కావడంతో 2 జిల్లాల అధికారులు పులిపై నిఘా ఉంచారు.

News March 21, 2026

నెల్లూరు: మాఫియాకు చెక్ పెట్టేది ఎప్పుడు.. ఎలా?

image

ఒక్కసారి జరిగితే తప్పు. అదే పదేపదే జరిగితే నేరం. ప్రస్తుతం నెల్లూరులో జరిగేది ఇదే. రాజకీయ నేతల అండదండలతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్నారు. 2025లో 73 కేసులు నమోదు చేసి 2400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 2026లో 14 కేసులు నమోదు చేసి 650.8 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 15 నెలల్లోనే రూ. 1.37 కోట్ల ధాన్యం పట్టుబడింది. మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.