News December 2, 2025
ధాన్యం సేకరణలో అవకతవకలు జరగకుండా నిఘా పెట్టాలి: బాపట్ల కలెక్టర్

బాపట్ల జిల్లాలోని రైస్ మిల్లులలో ధాన్యం భద్రతపై కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కస్టోడియన్ అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం సేకరణలో అవకతవకలు జరగకుండా నిఘా పెట్టాలని, మిల్లులకు వచ్చే ధాన్యాన్ని పక్కదారి పట్టనీయకుండా ప్రతిరోజు పర్యవేక్షించి ఫొటోలు పంపాలని ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టలతో కప్పేలా చూడాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 1967ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 15, 2026
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు!

ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in
News March 15, 2026
నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

నంద్యాలలో గోళ్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక్క రూపాయికే భోజనం కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
News March 15, 2026
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు TGలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.


