News December 2, 2025

టీజీ అప్డేట్స్

image

* ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు అందజేత
* రేపు లేదా ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) టీమ్.
* ఈ నెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్. పూర్తి వివరాలకు <>euffindia.com<<>>ను విజిట్ చేయండి

Similar News

News March 13, 2026

యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

image

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.

News March 13, 2026

టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

image

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన ప‌థ‌కంపై కుట్ర‌లు చేసినా, నాణ్య‌త త‌గ్గినా క‌ఠిన‌ చ‌ర్య‌లు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

భారత్‌కు బయల్దేరిన LPG ట్యాంకర్?

image

హార్ముజ్‌పై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నా భారత్‌కు వస్తున్న భారీ LPG ట్యాంకర్ జలసంధిని దాటినట్లు సమాచారం. భారత్‌లో గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో భారత్ పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు భారత్-ఇరాన్ మిత్రదేశాలని, హార్ముజ్‌ ద్వారా భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని ఢిల్లీలోని ఆ దేశ అంబాసిడర్ తెలిపారు.