News December 2, 2025
NTR: తండ్రి మరణించినా.. పెన్షన్ల పంపిణీ ఆపలేదు..!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి కె. భవానికి పుట్టెడు దుఃఖం ఎదురైంది. సోమవారం ఉదయం ఆమె పెన్షన్ల పంపిణీకి వెళ్లింది. అదే సమయంలో ఉదయం 7 గంటలకు ఆమె తండ్రి కన్నుమూశారు. విషయాన్ని ఆమె తెలియజేశారు. అయినప్పటికీ పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎదురుచూస్తుంటారనే ఉద్దేశంతో, బాధను దిగమింగుకొని పెన్షన్లను పంపిణీ చేశారు.
Similar News
News March 15, 2026
అనకాపల్లి: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన అక్షరాంధ్ర పరీక్ష

అనకాపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో 2,478 పరీక్షా కేంద్రాల్లో 93, 292 మంది అభ్యాసకులు పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. జిల్లాను శత శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
News March 15, 2026
అనకాపల్లి: రేపటి నుంచి రైతన్న-మీ కోసం

జిల్లాలో ఈనెల 16 నుంచి రైతన్న-మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ సహకారం ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాబోయే ఎల్‌నినోపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
News March 15, 2026
అలర్ట్..డొంకరాయి జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీరు విడుదల

ఇరిగేషన్ అధికారుల ఆదేశాలతో డొంకరాయి జలాశయం నుంచి ఆదివారం 3 గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ రాజారావు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలకు రబీ సీజన్ అవసరాలకు 8,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా డొంకరాయి జలాశయం గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కులు, జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


