News December 2, 2025
హైదరాబాద్‌లో తొలి IFAS టెక్నాలజీ!

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్‌డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్‌లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్‌లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.
Similar News
News March 7, 2026
కుల్కచర్ల: పాంబండ ఆలయ చరిత్ర తెలుసా

త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం బ్రాహ్మణ హత్యా పాతకాన్ని నివృత్తి చేసుకునే క్రమంలో కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలోని శ్రీ పాంబండ ప్రాంతంలో స్వయంగా శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రతీతి. అదే సమయంలో లింగాన్ని అభిషేకించడానికి తన విల్లుతో రాతిశిలపై బాణాన్ని వేయగా గుండం ఏర్పడిందని, పాంబండ ప్రాంతం పాము ఆకారంలో ఉండటంతో పాంబండగా నామకరణం చేశారని ఇక్కడి చరిత్ర చెబుతోంది.
News March 7, 2026
తెలంగాణ సినీ అవార్డులు.. ఉత్తమ నటులు వీరే

☞ ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
☞ ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
☞ ఉత్తమ సహాయ నటి: భూమిక
☞ ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాబాయి)
>>>—జ్యూరీ స్పెషల్ అవార్డులు—<<<
☞ ఉత్తమ హీరో : రోషన్ (ఛాంపియన్)
☞ ఉత్తమ నటుడు : చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
☞ ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)
News March 7, 2026
చిరంజీవికి తెలంగాణ గద్దర్ అవార్డు-2025

☞ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
☞ పైడి జయరాజ్ అవార్డు- కమల్‌హాసన్
☞ సినారె అవార్డు- సుద్దాల అశోక్ తేజ
☞ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు-జయసుధ
☞ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్
☞ రఘుపతి వెంకయ్య అవార్డు-రమేశ్ ప్రసాద్
☞ కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
☞ బీఎన్ రెడ్డి అవార్డ్- సింగీతం శ్రీనివాస్


