News December 2, 2025

అల్లూరి: నేటి నుంచి ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు

image

మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు విశాఖపట్నం డిపో నుంచి సీలేరు మీదుగా నడిచే ఆర్టీసీ నైట్ సర్వీసు బస్సులను రద్దు చేసినట్టు విశాఖ డిపో డీఎం మాధురి తెలిపారు. విశాఖ-సీలేరు నైట్ హాల్ట్, విశాఖ-భద్రాచలం, అలాగే భద్రాచలం-విశాఖ నైట్ సర్వీసులను రద్దు చేశామని పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Similar News

News March 18, 2026

గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలపై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ

image

గ్రామీణ డాక్ సేవక్‌ల పని ప్రదేశాల్లో స్థితిగతులపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్‌లో మాట్లాడారు. వెనకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచే ప్రక్రియ చేసిందా, ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులు నింపడం, మౌళిక వసతుల పెంపు, డిజిటల్ ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు పెంచి పోస్టల్ సర్వీస్‌ను మెరుగుపరిచే కార్యక్రమం చేసిందా అని అడిగారు. ఆయన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

News March 18, 2026

డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

image

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.

News March 18, 2026

విశాఖ: మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్

image

నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్టల్ గార్డ్ కాపాడింది. విశాఖకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 300 కి.మీ.ల దూరలో బోటు మరమ్మతులకు గురైంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్‌పాండర్ సాయంతో అధికారులను కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమాచారం మేరకు కోస్ట్ గార్డులు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడారు.