News December 2, 2025
టెన్త్ పరీక్షలు ఎప్పుడంటే?

TG: టెన్త్ పరీక్షలు 2026 మార్చి 16న నిర్వహించేందుకు SSC బోర్డు సిద్ధమైంది. మార్చి 13తో ఇంటర్ ఎగ్జామ్స్ ముగియనున్న నేపథ్యంలో వెంటనే వీటిని నిర్వహించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఒక్కో పేపర్‌కు మధ్య 1-2 రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఒకవేళ MAR 16న పరీక్షలు మొదలైతే ఏప్రిల్ మొదటి వారంలో ముగియనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ రానుంది.
Similar News
News March 20, 2026
రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.
News March 20, 2026
రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.
News March 20, 2026
మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.


