News December 2, 2025

పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

image

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.

Similar News

News March 6, 2026

థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు భారీ ఊరట

image

TG: థియేటర్ల పార్కింగ్ విషయంలో ప్రేక్షకులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 GOను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందనే విషయం తెలిసిందే.
Share It

News March 6, 2026

ఎర్లీ డిన్నర్.. రాత్రి ఆకలేస్తోందా?

image

హెల్త్ కోసం ఎర్లీగా తింటే పడుకునే టైమ్‌కు ఆకలేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే బెటర్. ముందుగా సైకలాజికల్‌గా ఈ టైమ్ తర్వాత తినొద్దని ఫిక్స్ అవ్వాలి. ఆకలేయగానే తినడానికి బదులు నీళ్లు తాగాలి. పాలూ తాగొచ్చు. నట్స్ లాంటి పోషకాలతో కూడిన స్నాక్స్ తక్కువ మోతాదులో తినొచ్చు. జర్నలింగ్, వాకింగ్ వంటి హాబిట్స్‌తో ఆకలిని మరిపించొచ్చు. కొన్నాళ్ల తర్వాత బాడీ అలవాటుపడిపోతుంది.

News March 6, 2026

న్యూయార్క్‌ మేయర్‌నే ఎన్నుకోలేకపోయావ్.. ట్రంప్‌కు పంచ్!

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ సహాయమంత్రి సయ్యద్ సెటైర్ వేశారు. ‘ట్రంప్ న్యూయార్క్ మేయర్‌ను ఎన్నుకోలేకపోయారు. కానీ ఇరాన్ నాయకుడిని డిసైడ్ చేస్తారట’ అని పంచ్ వేశారు. కాగా ఇటీవల ఎన్నికల్లో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడే మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.