News December 2, 2025
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: తూర్పుగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు గల మహిళలు ఈనెల 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏడో తరగతి, టెన్త్ , డిగ్రీ, పీజీ (సైకాలజీ డిప్లొమా/ సైకియాట్రీ/ న్యూరోసైన్సెస్/ LLB/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ పబ్లిక్ హెల్త్/ MSW), బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in
Similar News
News March 21, 2026
కామారెడ్డి: హరించుకుపోతున్న అటవీ సంపద..!

జిల్లాలో అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గుతోంది. గత రెండు దశాబ్దాల్లో సుమారు 450 హెక్టార్లకు పైగా అటవీ సంపద హరించుకుపోయింది. ముఖ్యంగా బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారి ప్రాంతాల్లో ‘పోడు సాగు’ కోసం చెట్లను నరికివేస్తుండటంతో వందలాది ఎకరాల అటవీ భూమి సాగు భూమిగా మారుతోంది. అటవీ అధికారులు నిఘా పెంచినప్పటికీ, ఆక్రమణలను అరికట్టడం సవాలుగా మారింది.
#నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.
News March 21, 2026
ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.


