News December 2, 2025
ఖమ్మం: ఓటు హక్కుపై యువత వినూత్న కార్యక్రమం

ప్రజాస్వామ్య బలోపేతంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సోమవారం ‘Cast Your Vote’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వారు తమ సామాజిక బాధ్యతను చాటుకుని, మిగతా యువత అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News December 3, 2025
అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏ గ్రామం నుంచి ఎంతో తెలుసా.!

పల్నాడు జిల్లాలో రాజధాని అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధమైంది. అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి భూమిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెద్ద మద్దూరులో 1,018 ఎకరాలు, యండ్రాయి గ్రామంలో 1,879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడి, లేమల్లెలో 2,063 ఎకరాల పట్టా, 50 ఎకరాల అసైన్డ్ భూమి భూమిని సేకరించనున్నారు.
News December 3, 2025
VJA: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ బాలికపై 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.
News December 3, 2025
WGL: సీఎం సభపై భరోసా!

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 3వ దశ నామినేషన్లకు చేరుకొవడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలను ప్రస్తావించడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు. నర్సంపేటలో ఈ నెల 5న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సభనే తమకు మైలేజని అభ్యర్థులంటున్నారు.


