News December 2, 2025
నంద్యాల: హత్య కేసులో నలుగురి అరెస్ట్

నంద్యాలలో మేదరి పుల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడి ఆస్తులు, డబ్బులు కాజేయాలని కుట్ర పన్ని ధనుంజయ అనే వ్యక్తి సహచరులతో కలిసి పుల్లయ్యను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి, ఇంట్లో నుంచి DVRలు, ల్యాప్టాప్‌లను దొంగిలించారని చెప్పారు. ఈ కేసులో ధనుంజయ్, సంతోష్, రాఘవ, శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.
Similar News
News March 21, 2026
రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది: నాదెండ్ల

AP: రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4,500 మెట్రిక్ టన్నుల కోటాను 5,200 మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచిందని వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు వస్తుండటంతో అక్కడికి పంపే సిలిండర్లను హోటళ్లకు ఇస్తామని హోటల్స్ జేఏసీ బృందానికి హామీ ఇచ్చారు. మరోవైపు త్వరలోనే కిరోసిన్‌ను ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
News March 21, 2026
సౌత్ జోన్ ఖోఖో పోటీలకు సంగారెడ్డి యువకులు

సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయి ఖోఖో పోటీలకు కల్హేర్ మండలానికి చెందిన మోతీరామ్, సాయికిరణ్ ఎంపికయ్యారు. ఈ నెల 26 నుంచి 29 వరకు బెంగళూరులో జరిగే ఈ పోటీల్లో వీరు పాల్గొంటారని ఖోఖో అసోసియేషన్ ప్రతినిధి రాములు యాదవ్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా ఉత్తమ ప్రతిభ కనబరచాలని కోరుతూ పలువురు ఈ యువకులను అభినందించారు.
News March 21, 2026
అన్నమయ్య జిల్లాలో రూ.37 కోట్లతో రోడ్ల నిర్మాణం

అన్నమయ్య జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 45 రోజుల్లో జిల్లాలో రూ.37కోట్లతో 92కిలోమీటర్ల కొత్తరోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మార్చి 31వ తేదీ లోపు టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు.


