News December 2, 2025
ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్‌కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News April 2, 2026
ప.గో: కాలువలో మునిగి విద్యార్థి మృతి

కాలువలో స్నానానికి దిగిన పదవ తరగతి విద్యార్థి గణపతిరాజు సాహిల్ కుమార్ (16) మృతి చెందాడు. పదో తరగతి పరీక్షలు అయిపోయాయనే ఆనందంతో కొందరు స్నేహితులు కలిసి కాలువలో స్నానానికి దిగారు. ఇరగవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సాహిల్ కుమార్‌తో పాటు పదిమంది విద్యార్థులు కలిసి మండపాక నుంచి రేలంగి వెళ్లే రోడ్డులో కాలువలో స్నానానికి దిగారు. సాహిల్ కుమార్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు.
News April 2, 2026
ఎల్‌నినో ప్రభావంపై అవగాహన అవసరం: కలెక్టర్ నాగరాణి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రైనర్స్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన ప్రణాళికలతో రైతులకు అవగాహన కల్పించి సాగులో అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
News April 2, 2026
భీమవరంలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

భీమవరంలోని చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్ టెన్త్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరు, కేంద్రంలో అమలవుతున్న నిబంధనలను ఆమె నిశితంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వసతులపై ఆరా తీశారు. అధికారుల పర్యవేక్షణ చర్యలను సమీక్షించిన కలెక్టర్, పరీక్షలు ప్రశాంతంగా ముగియడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.


