News December 2, 2025
పెనుగంచిప్రోలు: అమ్మవారి దర్శనం ఇక ఆన్‌లైన్‌లో

పెనుగంచిప్రోలు అమ్మవారి దర్శనం, సేవలను ఇకపై ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. దర్శనం టిక్కెట్లు, ప్రసాదం టిక్కెట్లతో పాటు ఇతర సేవలను https://www.aptemples.org వెబ్‌సైట్ లేదా 9552300009 వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్నదానం, గోసంరక్షణ వంటి పథకాలకు క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ (Google Pay, Phone Pe, Paytm, BHIM) ద్వారా కూడా విరాళాలు చెల్లించవచ్చని తెలిపారు.
Similar News
News March 24, 2026
మహిళలకు LSలో 273 సీట్లు.. APలో 12, TGలో 8?

లోక్‌సభ సీట్లు 816కి పెంచనుండడంతో 33.5% రిజర్వేషన్ల కోటా కింద మహిళలకు 273 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా UPలోని LS సీట్లు 120కి పెరుగుతుండడంతో అందులో 40 స్త్రీలకు దక్కుతాయి. MHలో 24, WB 21, TN, బిహార్‌లో 20 చొప్పున వారికి వెళ్తాయి. కాగా APలో 12-13, TGలో 8-9 LS స్థానాలు మహిళలకు దక్కే ఛాన్సుంది. కాగా విధివిధానాలు ఖరారయ్యాక ఎన్ని? ఏయే స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయో స్పష్టంగా తేలనుంది.
News March 24, 2026
GK: స్వాతంత్య్ర సమరయోధులు – రచనలు

☛ మహాత్మా గాంధీ – సత్యశోధన (My Experiments with Truth)
☛ జవహర్‌లాల్ నెహ్రూ – ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
☛ బాల గంగాధర్ తిలక్ – గీతా రహస్యం (Karma-Yoga Shastra)
☛ లాలా లజపతిరాయ్ – అన్‌హ్యాపీ ఇండియా
☛ డా. బి.ఆర్. అంబేడ్కర్ – అనైలేషన్ ఆఫ్ కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్థాన్
☛ మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఇండియా విన్స్ ఫ్రీడమ్
☛ సుభాష్ చంద్రబోస్ – ది ఇండియన్ స్ట్రగుల్
☛ సరోజినీ నాయుడు- ది గోల్డెన్ త్రెషోల్డ్
News March 24, 2026
కర్నూలు: సోషల్ మీడియాలో పేరు మార్చుకున్న TG భరత్

మంత్రి టీజీ భరత్ ‘ఇన్‌స్టాలో’ తన పేరు మార్చుకున్నారు. TG భరత్ నుంచి.. టీజీ భరత్ గుప్తా అని ఇక నుంచి తన పేరు ఉంటుందని ఆయన చెప్పారు. ఇటీవల ఆర్యవైశ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్యవైశ్యులందరూ పేరు చివరన గుప్తా అని పెట్టుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పేరులో కూడా చివరన గుప్తా అని పెట్టుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో సైతం టీజీ భరత్ గుప్తా అని ఆయన మార్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.


