News December 2, 2025

PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

image

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్​లోనే ఉంటుంది. దీన్ని లీన్‌ పీసీఓఎస్‌ అంటారు.

Similar News

News March 25, 2026

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

image

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.

News March 25, 2026

2 నెలలకు సరిపడా నిల్వలున్నాయి: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ 25% పెరిగిందని చెప్పారు. ట్యాంకర్ల ఆలస్యం కారణంగా, కొన్ని పెట్రోల్ పంపులు మూసివేశారని పేర్కొన్నారు. దేశంలో 60 రోజుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయన్నారు. ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని HYD CP సజ్జనార్ తెలిపారు.

News March 25, 2026

86 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి కాంట్రాక్ట్ పద్ధతిలో 86 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ, BE/BTech,ME/ఎంటెక్‌/Msc,MA/ఎంఈడీ/Phdతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో 06.04.26, ఆఫ్‌లైన్‌లో 16.04.26 వరకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.nitt.edu చూడండి.