News December 2, 2025
NGKL: రెండో రోజు దాఖలైన నామినేషన్ వివరాలు!

NGKL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 280 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 72 నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ (39), కోడేరు (37), నాగర్‌కర్నూల్ (45), తిమ్మాజీపేట (48), బిజినపల్లి (22), పెంట్లవెల్లి (17) నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 151 గ్రామాలకు గాను 458 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 5, 2026
వనపర్తి: రోజువారి ప్రతి కార్యక్రమం నివేదిక రూపంలో అందజేయాలి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్-అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి ప్రభుత్వ రంగాలకు సంబంధించిన 10 థీమ్‌లు ఉంటాయన్నారు. ప్రతి థీమ్ కోసం నోడల్ అధికారులను నియమించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పని చేయక ముందు, పని చేశాక జరిగిన ప్రతి కార్యక్రమంలో ఫొటోలు, వీడియోలను డాక్యుమెంటేషన్ చేయాలన్నారు.
News March 5, 2026
మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.
News March 5, 2026
‘నేను ఇంటికి వెళ్లాలి’.. వెస్టిండీస్ కోచ్ ఆవేదన!

T20 WC నుంచి వెస్టిండీస్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గగనతల ఆంక్షలతో వారు వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో తనకు ఇంటికి వెళ్లాలని ఉందంటూ వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు వెళ్తామో చెప్పండి. ఈ రోజా? రేపా? వచ్చే వారమా? ఇప్పటికే 5 రోజులు అవుతోంది’ అని ట్వీట్ చేశారు.


