News December 2, 2025

తిరుపతిలో ముగ్గురి మృతి.. ఏం జరిగిందంటే?

image

తిరుపతిలో ముగ్గురు <<18444073>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్(30) భార్యను వదిలేసి పొంగొటై(21)తో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుమారుడు మనీశ్(3)తో కలిసి దామినేడుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. 10రోజుల నుంచి వీళ్లు ఇంటి నుంచి బయటకు రాలేదు. నిన్న రాత్రి వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. రూములో విషం బాటిల్ ఉండటం, సత్యరాజ్ ఉరికి వేలాడుతుండటంతో ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.

Similar News

News December 5, 2025

కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

image

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.

News December 5, 2025

మదనపల్లెలో ఆసుపత్రి గుర్తింపు రద్దు..!

image

మదనపల్లిలోపి ఎస్బీఐ కాలనీలోని ఓ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రధాన ద్వారానికి నోటీసులు అంటించారు. ఆస్పత్రిలో నేటి నుంచి ఎలాంటి వైద్య సేవలు అందవని బ్యానర్ ఏర్పాటు చేశామని అధికారులు అన్నారు.

News December 5, 2025

నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం
రైతు వేదికలో శుక్రవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హాజరై ఎన్నికల నిర్వహణ, వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు.