News December 2, 2025

HNK: సర్పంచ్ అభ్యర్థి స్వతంత్రంగానే పోటీ చేయాలని తీర్మానం

image

జిల్లాలోని శాయంపేట (M) ప్రగతి సింగారంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలని, పార్టీల మద్దతు తీసుకోవద్దని ఎస్సీ కుల పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సర్పంచ్ స్థానం SCకి రిజర్వ్ అయింది. ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి పాటించాలని, పార్టీలపరంగా పోటీలో ఉండి ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ తీర్మానం చేశారు. ఈ తీర్మానం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 28, 2026

గన్నవరం విమానాశ్రయం ద్వారా శుక్రవారం ఎంతమంది ప్రయాణించారంటే!

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా శుక్రవారం 38 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 19 సర్వీసుల ద్వారా 1,523 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,643 మంది 19 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

News March 28, 2026

మూసీ దశ మారేలా.. కేబినెట్ సబ్ కమిటీ దూకుడు!

image

మూసీ నదికి పూర్వవైభవం తెచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. ఈ భారీ ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీధర్ బాబు, పొన్నం సభ్యులుగా ఉన్న ఈ కమిటీ నిధుల సమీకరణ నుంచి పునరావాసం దాకా అన్ని పనులను పర్యవేక్షిస్తుంది. మూసీ తీరాన్ని అద్భుత రివర్‌ఫ్రంట్‌గా మార్చడమే ఈ కమిటీ టార్గెట్.