News December 2, 2025
మదనపల్లె జిల్లా ప్రకటించినా..!

మదనపల్లె జిల్లాపై ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ హామీ ఇచ్చారు. తాజాగా జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వంతోనే జిల్లా సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోస్టర్లు పంచాలని హైకమాండ్ ఆదేశించింది. ఇక్కడ గ్రూపులు, ఖర్చు ఎందుకులే అని నాయకులు ప్రచారం చేయకుండా సైలెంట్ అయ్యారట. నా వల్లే వచ్చిందని MLA, నావల్లే వచ్చిందని మరికొందరు వేర్వేరుగా చెప్పుకోవడం కొసమెరుపు.
Similar News
News March 22, 2026
సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడం లేదు: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేవన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి రావడంలేదని స్పష్టం చేశారు.
News March 22, 2026
యుద్ధం.. కాసేపట్లో ప్రధాని మోదీ కీలక భేటీ

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పెట్రోలియం, పవర్, ఫెర్టిలైజర్ మంత్రులు పాల్గొననున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల సరఫరా, సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటమే మీటింగ్ ఉద్దేశమని తెలిపాయి. అలాగే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన అంశాలపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది.
News March 22, 2026
నర్మెటకు చేరుకున్న సీఎం

సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి హాజరయ్యారు. సీఎం టీజీ ఆయిల్ పామ్ కార్మాగారాన్ని ప్రారంభించి, రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.


