News December 2, 2025

WGL: రెండో విడతకు నేడు చివరి రోజు

image

ఉమ్మడి జిల్లాలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో 564 జీపీలు, 4928 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3న పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, 14న పోలింగ్ ఉండనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 1,365 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3037 నామినేషన్లు దాఖలయ్యాయి.

Similar News

News March 17, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

image

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.

News March 17, 2026

మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

image

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.

News March 17, 2026

ఆదోని: కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

image

కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వేటు వేశారు. మూడు రోజుల క్రితం గార్డెనియా విల్లాస్‌లోని ఓ ఇంటి ప్రహరీ పగలగొట్టి, బాధితుడు రాఘవేంద్రను భయభ్రాంతులకు గురిచేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. శనివారం త్రీటౌన్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో, విచారణ అనంతరం ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.