News December 2, 2025
నల్గొండ: మద్య నియంత్రణపై రాష్ట్రానికే ఆదర్శం..!

ఉమ్మడి నల్గొండ పరిధి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులు ఊరి బయటే ఏర్పాటు చేసి మ.1 తర్వాతే విక్రయాలు కొనసాగిస్తున్నారు. సా.6 గంటల తర్వాత మాత్రమే పర్మిట్ రూములకు అనుమతి ఇస్తున్నారు. మద్యం టెండర్లు పొందిన యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమై బెల్ట్ షాపుల నిషేధం, మద్య నియంత్రణ, స్థానికులకు ప్రాధాన్యం వంటి మార్గదర్శకాలు ఇచ్చారు.
Similar News
News March 20, 2026
రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.
News March 20, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.
News March 20, 2026
పాడేరు: పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు- కలెక్టర్

జిల్లాను పర్యాటకంగా మూడు క్లస్టర్లుగా అభివృద్ధి పరిచేందుకు సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ట్రెక్కింగ్‌కు అనుకూలంగా క్రాస్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొండచరియల బాట అభివృద్ధి, స్థిరీకరణ, నీటి పారుదల, కోత నియంత్రణ, మార్గదర్శనం, సంకేతాలు అభివృద్ధి చేయాలన్నారు.


