News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Similar News
News March 21, 2026
అన్నమయ్య జిల్లాలో రూ.37 కోట్లతో రోడ్ల నిర్మాణం

అన్నమయ్య జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 45 రోజుల్లో జిల్లాలో రూ.37కోట్లతో 92కిలోమీటర్ల కొత్తరోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మార్చి 31వ తేదీ లోపు టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు.
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
News March 21, 2026
BREAKING: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే మృతి

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన హనుమంతరాయ చౌదరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.


