News December 2, 2025
నల్గొండ: గ్రామాల్లో అంతర్గత పోరుతో రాజకీయ హీట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నుంచి పలువురు నేనే సర్పంచ్ అంటూ బరిలో దూసుకురావడంతో అంతర్గత పోరు మొదలైంది. ఇతర పోస్టులు సర్దుబాటు చేస్తామని నేతలు బుజ్జగిస్తున్నా వినకుండా స్వతంత్రగానైనా పోటీ చేస్తామంటూ సిద్ధం కోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.
Similar News
News March 24, 2026
అంగన్వాడీల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ అనుదీప్ అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లల హాజరు తక్కువగా ఉండటంపై కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని, సామ్, మ్యామ్ పిల్లలకు ఆర్‌బీఎస్‌కే వైద్యులతో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పోషకాహారం, సౌకర్యాలు మెరుగుపరచి హాజరు పెంచాలని అధికారులకు సూచించారు.
News March 24, 2026
వరంగల్‌లో కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు

వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీస్‌పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు చేశారు. మిర్చి తొడిమలతో కల్తీ కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు కృష్ణమూర్తి, మౌనికతో కలిసి సీఐ సురేశ్ ఈ తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 24, 2026
మెదక్: పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

మెదక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు.


