News December 2, 2025

సూర్యాపేట: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

image

తుంగతుర్తి మండలం గుడితండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ జయపాల్ నాయక్ వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆస్తులు కంటే ఎక్కువ సంపాదిస్తే తన ఆస్తులన్నింటినీ గ్రామస్థులు జప్తు చేయొచ్చని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శక పాలన అందిస్తానన్నారు.తనను గెలిపించాలని కోరారు.ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ SMలో వైరల్‌గా మారింది.

Similar News

News March 16, 2026

నల్గొండ: ప్రజావాణికి పోటెత్తిన అర్జీలు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 105 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, ఇతర శాఖలకు 45 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 16, 2026

బాపట్ల ఎస్పీ కార్యాలయానికి 59 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పూర్తిస్థాయి విచారణ జరిపి సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2026

నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

image

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.