News December 2, 2025

కృష్ణా: పోస్టాఫీసులో భారీ మోసం

image

ఉంగుటూరు పోస్టాఫీసులో నకిలీ స్టాంపులు, పాస్‌బుక్స్‌తో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టుమాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్ కలిసి ఏడాదిగా FDలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. సోమవారం ఓ మహిళ FD తీసుకోడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News March 15, 2026

పెద్దపల్లి: డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకానికి దరఖాస్తులు

image

పెద్దపల్లి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు “డ్రైవర్ ఎంపవర్‌మెంట్-2025-26” పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన యువత మార్చి 17 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.

News March 15, 2026

ఉండవల్లి: సీఎం నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం

image

ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద మంగళగిరికి చెందిన అడిగోపుల క్రాంతి కిరణ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్కింగ్ ప్రాంతంలో తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన ఇల్లు కబ్జా చేశారని, పలుమార్లు లోకేశ్ ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News March 15, 2026

102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

image

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.