News December 2, 2025
NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nsic.co.in
Similar News
News April 2, 2026
ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.
News April 2, 2026
హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.
News April 2, 2026
హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


