News December 2, 2025
నల్గొండ: ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల డబ్బులతో ఫ్యాకల్టీ పరార్!

విద్యార్థుల డబ్బులతో ఓ ఫ్యాకల్టీ ఉడాయించిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. విద్యార్థులకు స్కిల్స్ నేర్పించడానికి తెలంగాణ అకాడమీ స్కిల్స్ టాస్క్‌తో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా స్కిల్స్ నేర్పించేందుకు విద్యార్థుల వాటాగా ఫీజులు వసూలు చేశారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.4.70 లక్షలతో సదరు అధ్యాపకుడు ఉడాయించాడు.
Similar News
News March 14, 2026
వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

TG: మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా చేపడుతోన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారం రోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మూసీ ఒడ్డున ఉన్న 800ఏళ్ల నాటి శివాలయాన్నీ పునరుద్ధరించనుంది. ఉస్మానియా ఆస్పత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనుంది. ఓ భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు ముందుకొచ్చినట్లు సమాచారం.
News March 14, 2026
చారిత్రక అద్భుతం.. శత్రుదుర్భేద్యం గుత్తికోట

అనంతపురం జిల్లాలోని గుత్తికోట చారిత్రక వైభవానికి నిలువుటద్దం. సముద్ర మట్టానికి సుమారు 499M ఎత్తున ఉన్న ఈ కొండపై కోటను నిర్మించారు. చుట్టూ 15 బురుజులతో శత్రువులకు అభేద్యంగా ఉండే ఈ దుర్గం విజయనగర రాజులు నుంచి మరాఠాల వరకు ఎందరో వీరుల పాలనను చూసింది. కోటపై ఉన్న నీటి వనరులు, ప్రాచీన ఆలయాలు నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రభుత్వం గుత్తికోట <<19377820>>ఉత్సవాలను<<>> నిర్వహిస్తోంది.
News March 14, 2026
పి.గన్నవరం: విదేశాల్లో భార్య.. విమానాలు రద్దు.. ఇక్కడ భర్త మరణం!

పి.గన్నవరం(M) ముంగండలో శుక్రవారం సాయంత్రం పెయింటింగ్ పనులు చేస్తూ తోత్తరమూడికు చెందిన నేదునూరి రామకృష్ణ (34) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతని భార్య మరియమ్మ ఉపాధి నిమిత్తం మస్కట్‌లో ఉండగా, యుద్ధం వల్ల విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె రాలేని పరిస్థితి నెలకొంది. రామకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్యకు కడసారి చూపు దక్కలేదని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.


