News December 2, 2025

కామారెడ్డి: 2వ రోజు 353 నామినేషన్లు దాఖలు.!

image

కామారెడ్డి జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 7 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 353.. వార్డులకు 774 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి గాంధారిలో S-82 W-225, లింగంపేట S-65 W-110, మహ్మద్‌నగర్ S-27 W-101, నాగిరెడ్డిపేట S-44 W-75, నిజాంసాగర్ S-38 W-79, ఎల్లారెడ్డి S-49 W-78 పిట్లం S-48 W-106 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Similar News

News March 15, 2026

నంద్యాల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

News March 15, 2026

ఏం సందేశం ఇస్తున్నారు?

image

డ్రగ్స్ కేసులో TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగించేలా చేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది నేతలు ‘ఎంజాయ్’ చేసేందుకే ఎగిరిపోతున్నారు. తీరా చూస్తే ఇలా ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, క్లబ్బుల్లో ‘గబ్బు’ పనులు చేస్తున్నారు. యువతకు లెక్చర్లు ఇచ్చే ఇలాంటి నేతలు మందు, విందు, డ్రగ్స్ తీసుకుంటూ వారికి ఏం సందేశం ఇస్తున్నారు?

News March 15, 2026

KGM: ఏపీటీసీఐఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి మనోహర్

image

ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ (APTCIA) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన సాయి మనోహర్ దీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతి తిరుచానూరులో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. టైప్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.