News December 2, 2025
నల్గొండ: పల్లెల్లో పార్టీల ఫైట్..!

సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకున్నా.. పార్టీలకు పల్లెపోరు ప్రతిష్ఠాత్మకంగానే మారింది. తాము బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, BRS సీరియస్‌గా పనిచేస్తున్నాయి. డీసీసీ పదవి చేపట్టిన పున్న కైలాస్ నేత క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీని పంచాయతీలోనూ గెలిపించుకుందామంటూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు BRS, BJP తమ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం యత్నిస్తున్నాయి.
Similar News
News March 21, 2026
ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం
News March 21, 2026
సాగర్ నీటిమట్టం పతనం.. రైతన్నల్లో ఆందోళన

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 535.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎడమ కాలువకు 8541 క్యూసెక్కులు, కుడి కాలువకు 1023, ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవైపు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వదులుతుండగా.. మరోవైపు భానుడి భగభగలకు నీరు ఆవిరైపోతుండటంతో ప్రాజెక్టు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
News March 21, 2026
తిరుమలలో సరికొత్తగా CM చంద్రబాబు..!

తిరుమల పర్యటనలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు సరికొత్తగా కనిపించారు. శ్రీవారి దర్శనం తర్వాత అన్నదానం కేంద్రానికి చేరుకున్నారు. భక్తులకు ఆయనే స్వయంగా వడ్డించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. తర్వాత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని లాలించారు. ఆ సమయంలో CM మెడలో ఓ మాల దర్శనమిచ్చింది. చంద్రబాబు సరికొత్తగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.


