News December 2, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

NGKL జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను మంగళవారం ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలం సిరిసనగండ్లలో 17.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పదర (17.4), అమ్రాబాద్ (17.6), కల్వకుర్తి మండలం తోటపల్లి (17.6)లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 24, 2026

బందరు వాసికి కీలక పదవి

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధిగా జనసేన నేత శ్రీనివాస్ మిరియాల నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ(రాజకీయ వ్యవహారాలు) జె.శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర IT విభాగ ఛైర్మన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ స్వస్థలం మచిలీపట్నం కాగా కీలక పదవిలో నియమితులైన జనసేన నేతకు పలువురు అభినందనలు తెలిపారు.

News March 24, 2026

దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా PM మోదీ పిలుపునిచ్చారు. వార్ ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు.

News March 24, 2026

హన్మకొండలో 25 హై రిస్క్ గ్రామాలు

image

హన్మకొండ జిల్లాలో 25 గ్రామాలను హై రిస్క్ గ్రామాలుగా గుర్తించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అప్పయ్య తెలిపారు. వంద రోజుల్లో 14 ఏళ్లు పైబడిన వారందరినీ పరీక్షించి, ఎక్స్రే, సీబీ నాట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్య రక్షణపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సమీపంలోని పీహెచ్ సీకి వెళ్లాలని ఆయన సూచించారు.