News December 2, 2025
ధన్వాడ: ఎన్నికల చిత్రాలు.. ఉదయం బీఆర్ఎస్, రాత్రికి కాంగ్రెస్!

ధన్వాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విచిత్ర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నీరిటి రామచంద్రయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే, రాత్రికి మళ్లీ డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ అనూహ్య పరిణామంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 24, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుండటంతో ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, పునర్విభజన తర్వాత 17 లేదా 18కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల సంఖ్య 179కి చేరితే, జనాభా ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 నుంచి 6 నియోజకవర్గాలు అదనంగా ఏర్పడే అవకాశం ఉంది.
News March 24, 2026
ముంబైకి సూర్యను కెప్టెన్ చేయాలి: అశ్విన్

MI కెప్టెన్సీని సూర్యకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల <<19453220>>మాజీ క్రికెటర్ శ్రీకాంత్<<>>, తాజాగా అశ్విన్ ఇవే కామెంట్స్ చేశారు. ‘హార్దిక్ మంచి నాయకుడే. కానీ MIకి వచ్చాక తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ప్రస్తుతం భారత T20 జట్టు కెప్టెన్ సూర్య IPLలో హార్దిక్ నాయకత్వంలో ఆడాలి. ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
* MI కెప్టెన్‌గా ఎవరు బెటర్? కామెంట్ చేయండి.
News March 24, 2026
రూపాయి లాభం లేక.. రోజుకు రూ. కోట్లలో నష్టం

అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం, ఎగుమతులు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పతనమై పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4.60 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో కేవలం రూ.3.50 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు ఒక్కో గుడ్డుపై రూ. 1.10 నష్టం వాటిల్లుతోంది. సుమారు 2000 పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న 2 కోట్ల కోళ్ల ద్వారా రోజూ జరిగే ఉత్పత్తిపై రైతులకు నిత్యం రూ.కోట్లలో నష్టం వస్తోంది.


