News December 2, 2025
నల్గొండ: స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మె బాట షురూ!

నల్గొండ జిల్లాలో స్టోన్ క్రషర్స్ యజమానులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్ట సాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
News March 10, 2026
KNR: 14న బండి సంజయ్ యాత్ర

ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ మేయర్ పీఠంతో పాటు స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఈనెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమై, 40 కి.మీల మేర సాగే ఈ పాదయాత్ర సాయంత్రానికి కొండగట్టు చేరుకుంటుంది. నూతన ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఆయన మొక్కులు తీర్చుకోనున్నారు.
News March 10, 2026
అమలాపురం: అన్నం ఉడకలేదని భర్త కొట్టాడు.. 112కి కాల్ చేసిన భార్య..!

అమలాపురం పట్టణంలోని మెట్ల కాలనీలో ఓ మహిళ నుంచి పోలీసులకు విచిత్రమైన పిలుపు అందింది. వండిన అన్నం సరిగ్గా ఉడకలేదనే కారణంతో భర్త తనను కొట్టాడంటూ ఆమె 112కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకోగా భర్త అక్కడ లేరు. దీంతో పోలీసులు ఆమెతో భర్తకు ఫోన్ చేయించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేయడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.


