News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం!

image

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో అనేక పంచాయతీలో ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ.

Similar News

News March 22, 2026

నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.

News March 22, 2026

అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

News March 22, 2026

జగన్ హయాంలో ఏపీకి ఆర్థిక నష్టం: రామ్మోహన్ నాయుడు

image

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని చెప్పుకొచ్చారు. సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం అరసవిల్లిలో ఓ కార్యక్రమంలో రామ్మోహన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.