News December 2, 2025

VJA: జోగి రమేష్ కుమారులకు సిట్ నోటీసులు

image

నకిలీ మద్యం కేసు విచారణలో భాగంగా, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారులైన రాజీవ్, రోహిత్‌తో పాటు ఆయన సోదరుడి కుమారులకు సిట్, ఎక్సైజ్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తెరిచేందుకు వీరంతా బుధవారం విజయవాడ ఎక్సైజ్ స్టేషన్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.

Similar News

News March 14, 2026

అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

image

AP: అంగన్‌వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్‌నెస్‌ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.

News March 14, 2026

దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలి: వికారాబాద్ ఎస్పీ

image

కేసుల దర్యాప్తును ఆధునిక పద్ధతులతో వేగవంతం చేయాలని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం SP కార్యాలయంలో కానిస్టేబుళ్లు, రైటర్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీని వాడి దర్యాప్తు నాణ్యత పెంచాలని ఆదేశించారు.

News March 14, 2026

నంద్యాల జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే!

image

నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.