News December 2, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు గడువు పెంపు: అనకాపల్లి డీఈవో

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ విద్యా సంవత్సరం ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి గడువు పొడిగించినట్టు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. రూ.600 అపరాధ రుసుముతో ప్రవేశాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో స్టడీ సెంటర్ల నిర్వాహకులు దీనిని ప్రచారం చేసి అవసరమైన విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని ఆయన కోరారు.

Similar News

News April 3, 2026

PHOTOS: భూమి ఎంత అందంగా ఉందో చూడండి

image

‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లూ, బ్రౌన్ రంగుల వెలుగుల్లో అద్భుతంగా ప్రకాశిస్తున్న భూమి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తుండగా స్పేస్ క్రాఫ్ట్‌లోని విండో నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొంది. నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన రాకెట్ ఈ నెల 2న నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

News April 3, 2026

తిరుమల: భక్తి ముందు ఓడిన గర్వం.!

image

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి <<19559783>>దాసుడి<<>> భక్తిని వివరించారు. పేదవాడైనా అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు. అహంకారాన్ని వీడి భక్తితో సేవ చేయడం ప్రారంభించాడు.

News April 3, 2026

తిరుమలలో ‘ఓడు ప్రసాదం’ గురించి తెలుసా?

image

పేద కుమ్మరి దాసుడు శ్రీవేంకటేశ్వరుడిపై అపారమైన భక్తి కలిగినవాడు. నిశ్చలమైన మనస్సు, మట్టిపూలతో శేషమూర్తికి పూజ చేసేవాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, అతను తయారు చేసిన పగిలిన మట్టి కుండలోనే నైవేద్యం స్వీకరిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఆ ప్రసాదాన్ని “ఓడు ప్రసాదం”గా పిలుస్తున్నారు. ఈ కథ మనకు భక్తి విలువను, అహంకారం లేకుండా సేవ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.