News December 2, 2025

నల్గొండ: ‘మా ఊరికి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం!’

image

తమ ఊరికి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం.. లేదంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామంటూ నల్గొండ జిల్లా వేములపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం SMలో చక్కర్లు కొడుతోంది. వేములపల్లి పరిధి NSP క్యాంపు కాలనీకి రాకపోకలు కొనసాగించాలంటే వేములపల్లి నుంచి NKP-అద్దంకి రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 6, 2026

రేపు పిడుగులతో వర్షాలు!

image

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందంది. ఇవాళ అనంతపురం(D) తెరన్నపల్లిలో 42, కడప(D) రాజుపాలెంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

News April 6, 2026

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్నేహ శబరిష్

image

వేసవి సమీపిస్తున్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన ఆరోగ్య సూత్రాలు పాటించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం 9441471624 ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News April 6, 2026

ప్రకాశం: పిడుగుపాటుతో మరో ఇద్దరి మృతి

image

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో పిడుగుపాటుకు గురై <<19582036>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దర్శి(M) చామంతి పూడిలో పిడుగు పడి ఆవుల మల్లికార్జున అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ముండ్లమూరు మండలం వేములబండ గ్రామ పొలాల్లో రావులపల్లి శివ కృష్ణ మృతి చెందాడు. వీరితో కలిపి మొత్తం నలుగురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలు. కొన్ని చోట్ల ఎద్దులు కూడా మృతి చెందాయి.