News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 17, 2026

NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

image

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.

News March 17, 2026

విశాఖ: సరెండర్ తర్వాత భవానీ శంకర్‌కు పోస్టింగ్

image

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.