News December 2, 2025

కగార్ దెబ్బ.. PLGA వారోత్సవాలు లేనట్లే!

image

ఏటా డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తున్న నక్సల్స్ PLGA వారోత్సవాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. మావోల లొంగుబాటు, అగ్రనేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, 1999 కొయ్యురు ఉమ్మడి కరీంనగర్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముగ్గురు ముఖ్యనేతల త్యాగాలకు గుర్తుగా 2000 సంవత్సరం నుంచి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

Similar News

News March 25, 2026

పండ్రేగుపల్లి నేత అదృశ్యం సుఖాంతం.. హైదరాబాద్‌లో ఆచూకీ

image

పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజు <<19470053>>కిడ్నాప్ <<>>కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్‌నకు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో సీఐ వడ్డేపల్లి మురళీ దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలపడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 25, 2026

బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు: జనసేన

image

బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. కావున బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకి జనసేన పార్టీకి సంబంధం లేదన్నారు.

News March 25, 2026

జూరాల – ఆత్మకూరు రాకపోకలు బంద్

image

దిగువ జూరాల జెన్కో యూనిట్ల నుంచి టర్బైన్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేయడంతో గద్వాల – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉద్ధృతి పెరగడంతో ప్రయాణికుల రక్షణార్థం పోలీసులు బుధవారం రోడ్డును మూసివేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఈ దారి మళ్లీ మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.