News December 2, 2025
కృష్ణా: టెన్త్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరయల్స్

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 60 వేలమందికి పైగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి వందరోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. అదే రోజు తుది పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా స్ఫూర్తి మెటీరియల్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా SCERT మరో మెటీరియల్ అందిస్తుంది. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి. పిల్లలు అందరూ ఒక విధంగా పరీక్షలకు సిద్ధం కావాలని మెటీరియల్ ఆదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 18, 2026
పెద్దపల్లి: ‘మూడు విడతల్లో రైతు భరోసా’

యాసంగి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. CM రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 1,51’300 మంది రైతుల ఖాతాలో రూ. 162.52 కోట్లు నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ అవుతాయన్నారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు నూతనంగా రైతు భరోసా కోసం AEO ల వద్ద మార్చి 25 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
News March 18, 2026
భువనగిరి: పీఎం కిసాన్ పథకానికి ఈ రైతులు దూరం..!

భువనగిరి జిల్లాలో సుమారు 2.85 లక్షల మంది రైతులు ఉండగా, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 25 వేల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. 2019 తర్వాత కేంద్రం కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. గత ఏడేళ్లలో జిల్లాలో సుమారు 30 వేల మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమనార్హం.
News March 18, 2026
HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.


