News December 2, 2025

నల్గొండ: సెటిల్‌మెంట్ల కోసం నామినేషన్లు..?

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలో కొందరు ప్రజా సేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీదారులతో మాట్లాడుకుంటున్నారు. కొంత డబ్బు తీసుకుని విత్‌డ్రా చేసుకుని, సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను సైతం చివరకు దందా చేశారని పలువురు మండిపడుతున్నారు.

Similar News

News March 6, 2026

ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

image

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.

News March 6, 2026

KMR: దొంగతనం.. ఎనిమిది నెలల జైలు

image

చోరీకి పాల్పడిన నిందితుడికి కోర్టు 8నెలల జైలుశిక్షతో పాటు ₹300 ఫైన్ విధించింది. SP రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలు.. భిక్కనూర్ వాసి వేణు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ₹10 వేలు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిట్లపల్లి సాగర్ చోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష, జరిమానా ఖరారు చేసింది.

News March 6, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 6)

image

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం