News December 2, 2025

ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

image

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్‌తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. ఉప్పల్‌తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <>ఇదే.<<>>

Similar News

News March 28, 2026

బాలకృష్ణ సినిమాలో డింపుల్ హయాతి!

image

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో డింపుల్ హయాతి నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నయనతార లీడ్ రోల్‌లో నటిస్తుండగా, డింపుల్‌ సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ మాస్ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌ తరహా పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాయి. గోపి-బాలయ్య కాంబోలో తొలి మూవీ వీరసింహారెడ్డి కాగా ఇది రెండోది. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.

News March 28, 2026

వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే?

image

పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ బెడ్ షీట్స్ వాడితే చల్లగా ఉంటాయి. రాత్రి మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం తినొద్దు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే గంట ముందు గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు తాగితే శరీరం చల్లబడుతుంది. సాయంత్రం తర్వాత టీ, కాఫీ దూరం పెట్టాలి. పడుకునే ముందు నీరు ఎక్కువగా తాగొద్దు.

News March 28, 2026

ఆ జిల్లాలకు APSDMA బిగ్ అలర్ట్

image

AP: రాష్ట్రంలోని 35 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే ఆస్కారముందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40°C-42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇవాళ మార్కాపురం(D) బొట్లగూడురులో 42.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది.