News December 2, 2025

ధరలు డబుల్.. దానిమ్మ రైతులకు గోల్డెన్ టైం!

image

అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి. ప్రస్తుతం టన్ను ఏకంగా ₹లక్ష పలుకుతోంది. జిల్లాలో 13,381 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. తాడిపత్రి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, యాడికి తదితర మండలాల్లో అధికంగా సాగుచేశారు. 3 నెలల క్రితం టన్ను రూ.50-60 వేల వరకు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఇతర రాష్ట్రాలో దిగుబడి ఆలస్యం కావడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News March 7, 2026

కేతిరెడ్డికి సహకరించారని తహశీల్దార్లకు నోటీసులు

image

ధర్మవరంలో భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి సహకరించిన అప్పటి తహశీల్దార్లు యుగేశ్వరి దేవి, నీలకంఠారెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చెరువు భూములను ఆక్రమించి ఫాంహౌస్, రేస్ కోర్సులు నిర్మించినా, కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు ఇచ్చారని విచారణలో తేలడంతో పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 7, 2026

జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు..?

image

మాజీమంత్రి జీవన్ రెడ్డిపై MP అరవింద్ ఎప్పుడూ సాఫ్ట్ కార్నర్‌తోనే ఉంటున్నారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కాదని, అర్వింద్‌కు సహకారం అందించారు. అలాగే, అరవింద్ తండ్రి శ్రీనివాస్‌తో కూడా అనుబంధం ఉంది. దీంతో ఎంపీ అరవింద్, జీవన్ రెడ్డికి మధ్య మంచి బాండింగ్ ఉంది. గురువారం జగిత్యాలకు వచ్చిన ఎంపీ.. మరోసారి జీవన్ రెడ్డిపై జాలి చూపి, ఎమ్మెల్యే సంజయ్‌పై విరుచుకు పడ్డారు.

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటడం రాష్ట్రానికే గర్వకారణం: అడ్లూరి

image

జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంకులు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది ఉత్తమ ఫలితాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. దళిత యువతకు నాణ్యమైన శిక్షణ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేద విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు సోపానాలుగా మారుతున్నాయన్నారు.