News December 2, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మణపల్లి 12.8°C, డోంగ్లి 13, గాంధారి 13.1, నస్రుల్లాబాద్ 13.2, జుక్కల్, బీబీపేట్, మేనూర్, బీర్కూర్ 13.3, బొమ్మన్ దేవిపల్లి 13.5, పెద్ద కొడప్గల్,సర్వాపూర్, పుల్కల్ 13.7, బిచ్కుంద 14, రామారెడ్డి 14.2, లచ్చపేట 14.4, మాక్దూంపూర్ 14.5, పిట్లం 14.6°C.

Similar News

News March 19, 2026

జనగామ జిల్లాలో 10,742 స్వయం సహాయక సంఘాలు

image

స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రాయితీ రుణాలతో పాటు, లింకేజీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు, తదితర సంక్షేమ పథకాల్లో ముందుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఐతే జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 10,742 స్వయం సంఘాల ద్వారా లక్షలాది మంది మహిళలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినట్లు నివేదికలు చెబుతున్నాయి.

News March 19, 2026

ప్రకాశం: శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు

image

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. విచారణ నిమిత్తం కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీ నియమించారు. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి వివరణ ఇవ్వాలని స్కూల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్లు రిప్లే ఇవ్వకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ అనుమతి రద్దు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.

News March 19, 2026

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

image

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.