News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News April 6, 2026

తౌషిక్ మృతి కేసు.. ఆ డేటానే కీలకం..!

image

నవోదయ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పునః విచారణలో భాగంగా ఆదివారం మొత్తం 13 ఫోన్లను విచారణాధికారి సీజ్ చేశారు. ఇందులో కళాశాల యాజమాన్యం, ఒక మహిళా టీచర్, వార్డెన్ ఫోన్లతోపాటు సింగరాయకొండ పోలీసుల ఫోన్లు, పోస్టుమార్టం నిర్వహించిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ ఫోన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్ డేటా ఆధారంగా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

News April 6, 2026

నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చుపై విచారణకు ఈసీ ఆదేశం

image

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.రాంసుందర్ రెడ్డికి ఇటీవల సూచించింది. ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా నగదు జమ చేసి తిరిగి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగించారని ఓ మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

News April 6, 2026

కడప జిల్లాకు కోట్ల ఆదాయం ఇలా.!

image

☞ మద్యం అమ్మకాల ద్వారా రూ.1,151.81 కోట్లు ☞ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.278.05 కోట్లు ☞ రవాణా శాఖ ద్వారా రూ.195.21 కోట్లు ☞పట్టణాల్లో ఇంటి పన్ను రూ.99.40 కోట్లు ☞ GST వసూళ్ల ద్వారా రూ.68.40 కోట్లు ☞ పట్టణాల్లో నీటి పన్ను రూ.16.95 కోట్లు ☞ AMCల ద్వారా రూ.13.37 కోట్ల ఆదాయం లభించింది.