News December 2, 2025
MHBD: 3వ విడత ఎన్నికల వివరాలు..!

జిల్లాలో 3వ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు 169, వార్డులు 1,412 ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 26 గ్రామాలు, 218 వార్డులు, గంగారం 12 గ్రామాలు, 100 వార్డులు, కొత్తగూడ 24 గ్రామాలు, 202 వార్డులు, కురవి 41 గ్రామాలు, 344 వార్డులు, మరిపెడ 48 గ్రామాలు,396 వార్డులు, సీరోల్ 18 గ్రామాలు, 152 వార్డులు ఉన్నాయి. 3వ విడత నామినేషన్లు ఈ నెల 3న, ఎన్నికలు 17న జరగనున్నాయి.
Similar News
News March 18, 2026
వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.
News March 18, 2026
HYDలో గ్యాస్ కొరతలేదు: కలెక్టర్

HYDలో ఎల్పీజీ గ్యాస్‌కు కొరత లేదని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, గృహ వినియోగదారులకు నిరంతర సరఫరా అందుతుందని వెల్లడించారు. పానిక్ బుకింగ్ చేయొద్దని, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరాపై బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయని తెలిపారు.
News March 18, 2026
ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద మంజూరైన 540 యూనిట్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. రూ.5.16 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ సెట్లు, ఉపాధి శిక్షణ అందించనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులు మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఏప్రిల్ నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు.


