News December 2, 2025
భువనగిరి: ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులు..!

బొమ్మలరామారం(M) చీకటిమామిడికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబీకులు 4 పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చంద్రమౌళి తొలిసారిగా 1995లో తర్వాత 2001లో కాగా 2007లో ఆయన తల్లి విజయం సాధించారు. 2013లో ఆయన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ MPTCగా గెలుపొందగా 2019లో శ్రీనివాస్ సతీమణి వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 30ఏళ్లపాటు తమ కుటుంబం గ్రామానికి సేవలందించిందని, ప్రస్తుతం ఇతరులకు అవకాశం ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News March 8, 2026
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా స్త్రీల భాగస్వామ్యం ఉందన్నారు. మానవ మనుగడను కొనసాగించే గొప్పబాధ్యతను అనేక కష్టాలను భరిస్తూ నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
News March 8, 2026
అందుకే భారత్‌కు మినహాయింపు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పడిందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దాన్ని తగ్గించేందుకే భారత్‌కు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల రష్యాకు ఉపయోగం ఉండదన్నారు. వాణిజ్యంలో భారత్ తమకు కీలక భాగస్వామి అని అన్నారు. అటు ఆయిల్ కొనుగోలులో తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని USకు భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News March 8, 2026
వరంగల్: పదో తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

వరంగల్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, ఆరుగురు రూట్ అధికారులు, ఆరుగురు అదనపు రూట్ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 496 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో 22 శాశ్వత, మిగిలిన 25 కేంద్రాల్లో తాత్కాలిక CC కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.


