News December 2, 2025
శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైరీ ఫుడ్ అంటూ!

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్‌పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.
Similar News
News March 24, 2026
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం: కలెక్టర్ ప్రతిమా సింగ్

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. 917 హ్యాబిటేషన్లలో 1.76 లక్షల కుటుంబాలకు నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1485 ట్యాంకుల శుభ్రత, బోర్లు, పైపుల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా పర్యవేక్షణతో పాటు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని తెలిపారు.
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.


