News December 2, 2025

లొంగుబాటు ప్రయత్నంలో మావోయిస్టు నేత బార్సే దేవా?

image

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ సభ్యుడు మడవి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానంలో బార్సే దేవా బెటాలియన్ నంబర్-1 కమాండర్‌గా ఉన్నాడు. హిడ్మా మృతి తర్వాత అతడి స్థానాన్ని దేవా భర్తీ చేశాడనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ప్రస్తుతం దేవా సైతం లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. దేవాతో కేవలం 20 మంది క్యాడర్లు మాత్రమే ఉండగా, పార్టీ మనుగడ కొనసాగడం కష్టతరంగా మారినట్లు సమాచారం.

Similar News

News March 22, 2026

సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారని ఆయన ట్రైనింగ్ టీమ్ వెల్లడించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 7 వారాల్లో 10kgs బరువు తగ్గారని తెలిపాయి. డైరెక్టర్ లీన్ ఫిజిక్ కావాలని చెప్పడంతో రోజూ 90min ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ కంట్రోల్ డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ HYDలో జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News March 22, 2026

భద్రకాళీ తీరం ఆహ్లాదం.. ఆధ్యాత్మికం..!

image

వరంగల్ నగర నడిబొడ్డున 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించిన భద్రకాళి చెరువు తీరం ఆహ్లాదంతో పాటు, ఆధ్యాత్మికతను అందిస్తుంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో రెండు కిలోమీటర్ల పొడవులో మానవ నిర్మిత ఈ కృత్రిమ సరస్సు. చెరువు ఒడ్డున భద్రకాళి అమ్మవారు, బండ్, కొండలు, రాతి నిర్మాణాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇటీవల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
# నేడు ప్రపంచ జల దినోత్సవం.

News March 22, 2026

అర్ధరాత్రి ఆపి మరీ ముఖం కడిగిస్తున్నారు..!

image

నిద్రమత్తు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘స్టాప్ వాష్ అండ్ గో’ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేస్తూ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.